
ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.అనవసరంగా ఇళ్లలోనుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే మిగతా వాళ్లంతా ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోండి. అసలు నా అభిప్రాయం ప్రకారం అందరూ ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని వీకే పాల్ అన్నారు.