
ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో టోక్యో కు పయనమవుతున్న వారితో ప్రధాని కొద్దిసేపటి క్రితం వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.