
ఐపీఎల్ 14వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతోవిజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 70 పరుగులు నాటౌట్ గా నిలిచి జట్టు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కృనాల్ 39 పరుగులతో అతనికి సహకరించాడు.