
ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొందగా రాజస్థాన్ కూడా రెండు మ్యాచ్ ల్లో నే విజయం సాధించింది.