నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రానున్న సినిమా నుండి ఆ మధ్య ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ సారాంశం ఏమిటంటే..’మేము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఇది, చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాస రావు గారును మా ఎపిక్ చిత్రానికి స్వాగతిస్తున్నందుకుగానూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని వైజయంతీ మూవీస్ వారు చాల గొప్పగా సగర్వంగా ఈ మెసేజ్ ను పోస్ట్ చేశారు.
కట్ చేస్తే.. నెలలు గడిచాయి. నాగ్ అశ్విన్ తో పాటు సింగీతం కూడా కథ మీద కూర్చున్నారు. మొదట్లో సింగీతం చెప్పిన పాయింట్లను చక్కగా విన్న నాగ్ అశ్విన్, ఆ తరువాత సింగీతం చెప్పేది వింటున్నాడు గానీ, అసలు పట్టించుకోవడం లేదట. గొప్ప లెజెండరీ డైరెక్టర్ మా సినిమా కోసం పని చేయబోతున్నారు అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకుని, ఇప్పుడు ఆ దర్శకుడ్ని వాడుకోకపోతే ఎలా ? మరోపక్క నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమి మాట్లాడలేకపోతున్నారు.
నాగ్ అశ్విన్ స్వయానా ఆ సంస్థకు అల్లుడు, పైగా అతను ఫామ్ లో ఉన్న దర్శకుడు. అందుకే సింగీతంకు అవమానం జరుగుతున్నా ఆ టీమ్ లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి సింగీతం కూడా ఆ సినిమాకి కాస్త దూరం జరిగారు. ఒకప్పుడు వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సింగీతం శ్రీనివాసరావును వైజయంతీ మూవీస్ వారు సరిగ్గా ఉపయోగించుకుంటే అది వారికే ఉపయోగం. కొత్తగా సింగీతంకు వచ్చేది ఏమిలేదు.
నిజానికి తన కథలతోనే సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టిన దిగ్ధర్శకులలో వైవిధ్యమైన అచ్చతెలుగు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో గొప్పగా నిలిచిన డైరెక్టర్స్ లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన తీసిన అప్పటి సినిమాలను చూసి షాక్ అవుతున్నారంటే దానికి కారణం ఆయన క్రియేటివిటీనే. అలాంటి లెజండరీ డైరెక్టర్ ను ఇలా అవమానించడం మంచింది కాదు. అది ప్రభాస్ టీమ్ కే నష్టం.