
కలెక్టరేట్ లోని 104 కంట్రోల్ రూమ్ కు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్ కూడా రాకపోవడంతో స్వయంగా 104 కి ఫోన్ చేశారు. కాల్ కనెక్ట్ కాకపోవడంతో విజయసాయిరెడ్డి తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వర్ లో సాంకేతిక లోపం ఉందని అధికారులు చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను విజయసాయిరెడ్డి ఆదేశించారు. ఆనంతరం కేజీహెచ్ లో వైరాలజీ లాబ్ ను విజయసాయి సందర్శించారు.