
ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతున్న పాట బుల్లెట్ బండి. ఈ పాట మొదట యూట్యూబ్ లో విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పడు ఏకంగా తెరాసకు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బుల్లెట్ బండి పాటకు ఆడిపాడారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత నూతన వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులతో డ్యాన్స్ చేశారు.
https://www.youtube.com/watch?v=OZm2UFaiVSg