
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. బ్యాంక్ రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ అయ్యాయి. ఇటీవల జరిపిన సోదాల్లో భారీగా దస్త్రాలు, నగదు స్వాధీనం చేసుకుంది. మధుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు జారీ అయ్యాయి. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లలో ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ సోదాలు జరిపింది.