
ప్రతి ఒక్కరి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి ఒకటనే సంగతి తెలిసిందే. లక్షల్లో ఖర్చు చేసి పెళ్లిని గ్రాండ్ గా జరుపుకోవాలని భావించే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల ప్రస్తుతం చాలామంది తక్కువ సంఖ్యలో బంధుమిత్రులతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అమ్మయిని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపే కార్యక్రమం కూడా సింపుల్ గా జరుగుతోంది.
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా కొత్త కొడలికి అత్తింటి వాళ్లు చేసిన మర్యాదకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్తింటి వారు కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తూ స్వాగతం పలికారు. నోట్ల కట్టలు, వెండి సామాగ్రి ఇలా వేర్వేరు బహుమతులు ఇవ్వడంతో కొత్త కోడలికి నోటి నుంచి మాట రాలేదు. ఈ వీడియోలో అత్తింటి వాళ్లు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలవడం గమనార్హం.
నవ వధువుకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా మెట్టుమెట్టుకు ఒక బహుమతిని పెట్టి పెళ్లికూతురును ఫిదా అయ్యేలా చేయడం గమనార్హం. అత్తింటి మర్యాద చూసిన కొత్త కోడలికి మాట రాకపోగా ఆమె ఆనందంతో భావోద్వేగానికి గురి కావడం గమనార్హం. ఈ వీడియో ఎక్కడ జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. అత్తింటి వారి మర్యాదలను నెటిజన్లు మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.
https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2021/06/whatsapp-video-2021-06-15-at-44233-pm.mp4?_=1
ఈ వీడియోను చూసి నెటిజన్లు అత్తింటివారిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొత్త కోడలికి ఈ స్థాయిలో మర్యాదలు ఎవరూ చేయలేదని నెటిజన్లు కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.