
రాష్ట్రంలో కరోనా ఉధృతితో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేటులో కరోనా రోగుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.