Mosquitoes: నిన్న మొన్నటి వరకు చలి వణికించింది. కొంతమంది అయితే ఈ చలికాలంలో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి భయపడ్డారు. అయితే ఫిబ్రవరి లోనూ చలి ప్రభావం ఉన్నా కూడా.. గతంలో కంటే తగ్గిందనే చెప్పవచ్చు. అయితే చలి తగ్గుతున్న కొద్ది దోమలు పెరుగుతున్నాయి. దాదాపు నాలుగు నెలల పాటు ఎక్కడ కనిపించని దోమలు ఇటీవల చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కొంతమంది వైద్యులు తెలుపుతున్న ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలలో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఈ రెండు నెలలు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అసలు ఇంతకాలం కనిపించని దోమలు ఇప్పుడు ఎలా విజృంభిస్తున్నాయి? ఎన్ని రోజులు దోమలు ఏం చేశాయి?
నవంబర్ నుంచి జనవరి వరకు చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో దోమలు బయట తిరగలేవు. ఈ కాలంలో అవి నీటిలో గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్లు ఉష్ణోగ్రతలు పెరిగిన వెంటనే దోమలుగా మారి విజ్జుపిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దోమలు తక్కువ సమయంలోనే లార్వాల నుంచి బయటకు వస్తాయి. అంతేకాకుండా ఇవి చురుగ్గా సంచరిస్తూ పట్టణాలు, గ్రామాల్లో డ్రైనేజీల వద్ద నిలువ ఉంటూ వాటి శక్తిని పెంచుకుంటాయి. వైద్యులు తెలుపుతున్న ప్రకారం సాయంత్రం చీకటి పడగానే.. తెల్లవారుజామున దోమల బెడద తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో బెడ్ రూమ్ కిటికీ తెరవడం వల్ల వీటి ద్వారా లోపలికి వచ్చి మనుషులను కొడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువగా దోమకాటు ఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దోమ కాటుతో కేవలం దురద మాత్రమే కాకుండా ప్రాణాపాయ మైన జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దోమ కుట్టడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులతోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది.
అందువల్ల దోమల నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇంటి పరిసరాల్లో ఎక్కువగా మీరు నిలవకుండా చూసుకోవాలి. పూల కుండీలు, పాత టైర్లు, డబ్బాలు వంటి వాటిలో నీరు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు మూసి ఉంచాలి. దోమల నివారణకు సరైన చర్యలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో బయటకు వెళ్లేటప్పుడు చేతులku రక్షణ దుస్తులు ధరించాలి. జ్వరం, అలసట అనిపిస్తే సరైన చికిత్స తీసుకోవడం మంచిది. అయితే దోమల నివారణకు పరిశుభ్రత ప్రధాన మార్గం. అందువల్ల నివాస ప్రాంతాల్లో ఎక్కువగా పరిశుభ్రత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దోమల బెడద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
