
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 18,832 మంది కోలుకున్నారు. 92 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 12,87.603కు పెరిగాయి. ఇప్పటి వరకు 10,88,264 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు మొత్తం 1,90,632కు చేరాయి. 8707 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ 1,05,494 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది.