
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కల్లోలం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికీ రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదవుతున్నది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో మొత్తం 91,253 శాంపిళ్లను పరీక్షించగా 21,320 మందిక కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాటిటివ్ కేసుల సంఖ్య 14,75,372 కు చేరింది. 99 మంది కరో్నా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,580 కి చేరింది.