
మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16,577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 58,52,891కి పెరిగాయి. వీరిలో 55,80,925 మంది చికిత్సకు కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 1,67,927 కు చేరాయి.