Mohammed Shami spell నాలుగు ఓవర్లు.. కేవలం 9 అంటే 9 పరుగులు.. అందులో రెండు వికెట్లు.. ఎకనమి 2.20.. ఇందులో ఒక్క వైడ్ బాల్ మాత్రమే ఉంది. ఇలాంటి స్పెల్ వేసింది బుమ్రా కాదు.. సిరాజ్ కాదు.. షమీ.
అప్పుడెప్పుడో 2023లో వన్డే వరల్డ్ కప్ సాగుతున్నప్పుడు షమీ ఈ తరహాలో బౌలింగ్ వేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు తన పాత రూపాన్ని చూపించాడు. అది కూడా తన మాజీ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై. ఆదివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్ షమీ తన విశ్వరూపాన్ని చూపించాడు. సీమ్ ఆఫ్ డెలివరీలు వేయడంలో అతడు దిట్ట. పేస్ కూడా జనరేట్ చేస్తాడు. అయితే తొలిసారి తన శైలికి భిన్నంగా స్లో డెలివరీలు వేశాడు. పిచ్ నుంచి వస్తున్న సపోర్ట్ ను సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టుకు కలలో కూడా ఊహించని ఓటమిని అందించాడు.
షమీ తన తొలి ఓవర్ లోనే అత్యంత ప్రమాదకరమైన అభిషేక్ శర్మ ను అవుట్ చేశాడు. ఇది కూడా స్లో బంతి వేసి అతడిని బోల్తా కొట్టించాడు. ఇక్కడితోనే షమీ ఆగలేదు. భీకరమైన ఫామ్ లో ఉన్న హెడ్ కు ఊరించే బ్యాకప్ లింక్ బాల్ వేసి ఔట్ చేశాడు.
రెండు వికెట్లు తీసిన తర్వాత మిగతా ఓవర్లను అత్యంత కట్టుదిట్టంగా వేశాడు. పరుగులు తీయడం కాదు కదా వికెట్ కాపాడుకుంటే చాలు అన్నట్టుగా బంతులు వేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. అసలు వేస్తోంది షమీ నేనా అన్నట్టుగా చూశారు. ఇదే మైదానంపై గత ఏడాది బౌలింగ్ వేసిన షమీ.. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు ఇచ్చాడు.. అసలు అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు అనిపించే విధంగా ప్రవర్తించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం గత ఏడాది అతడికి అనేక అవకాశాలు ఇచ్చింది. కొన్ని సందర్భాలలో ప్రధాన బౌలర్లను కూడా పక్కన పెట్టి అతడిని ముందుండి నడిపించేలా చేసింది. అయినప్పటికీ అతడు తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అంతేకాదు జట్టు ఓటములలో తన వంతు పాత్ర పోషించాడు. అతడు అదనపు భారంగా ఉండడంతో మెగా వేలంలో హైదరాబాద్ యాజమాన్యం వదిలేసుకుంది. లక్నో జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. హైదరాబాద్ జట్టు మీద అతడికి సంపూర్ణ అవగాహన ఉంది. ఉప్పల్ మైదానంలో కూడా అతనికి ఆడిన అనుభవం ఉంది. హైదరాబాద్ బ్యాటర్ల లోపాలు తెలుసు కాబట్టి.. ఆదివారం నాటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన ఐపీఎల్ కెరియర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అందువల్లే అతడికి మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. లక్నో జట్టు కెప్టెన్ పంత్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. షమీకి మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది అంటే అతడి బౌలింగ్ సాగిన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.