
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. దాదాపు 90 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మంత్రి మోదీ వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమమంత్రులు,ఆరోగ్య మంత్రులతో కరోనా వైరస్‌పై ప్రధాని చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు ఆరోగ్య, మౌలిక సదుపాయాలప పెంపు తదితర అంశాలను కూడా చర్చలో చేర్చనున్నట్లు సమాచారం.
Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్