Modi Meloni viral video : కొంతమంది పరిచయం మన జీవితంలో రకరకాల మార్పులకు శ్రీకారం చుడుతుంది. అప్పటిదాకా మన జీవితం నిరాశలో ఉంటే.. వారి రాకతో సరికొత్త వసంతాలను సంతరించుకుంటుంది. వారు వచ్చిన సమయంలో సానుకూల దృక్పథం.. మదిలో మెదులుతుంది. అది కాస్త పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్తూ ఉంటుంది. సరిగ్గా ఇటువంటి పాజిటివ్ థింకింగ్ ను ఇటలీ ప్రధానమంత్రి మేలోని అలవర్చుకుంది. అది ఆమెను ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే..
ఆమధ్య మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ ఇటలీ వెళ్లారు గుర్తుంది కదా. అక్కడ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో చాలాసేపు మాట్లాడారు. అంతేకాదు ఆమెకు మెలోడీ చాక్లెట్లను అందించారు. ఆమెతో చాలాసేపు ముచ్చటించారు. సెల్ఫీలు కూడా దిగారు. మెలోడీ చాక్లెట్లు దెబ్బకు ఫేమస్ అయిపోయాయి. ఆ చాక్లెట్లను తయారు చేస్తున్న కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఇప్పుడు మార్కెట్లో మెలోడీ చాక్లెట్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. వాస్తవానికి మెలోడీ చాక్లెట్లకు ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీనే.
మెలోడీ చాక్లెట్లు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు మెలోని పూర్తిగా మారిపోయింది. గతంలో ఆమె సిగరెట్లు తాగేది. సిగరెట్లు తాగే అలవాటు కూడా విపరీతంగా ఉండేది. దీనివల్ల ఆమె చాలాసార్లు ఇబ్బంది పడింది. అయినప్పటికీ ఆ అలవాటును మార్చుకోలేకపోయింది. ఇప్పుడు ఆ అలవాటును మార్చుకుంటున్నట్టు జీ7 సమ్మిట్ లో ఆమె పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాల అధినేతలతో చెప్పింది. దీంతో వారు ఆమెను అభినందించారు. ఈమె మాత్రమే కాదు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తాను కూడా 2005లో స్మోకింగ్ మానేసినట్టు చెప్పింది..
వాస్తవానికి ఇటువంటి సమ్మిట్ లో ట్రేడ్.. లావాదేవీలు.. ఇతర వ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. కానీ తొలిసారిగా ప్రపంచ దేశాల అధినేతలు తమ వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. మెలోని స్మోకింగ్ మానేయడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ అని సోషల్ మీడియాలో కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆయన మెలోడీ చాక్లెట్లు ఇచ్చారని.. మెలోని వాటిని మానేసిందని.. ఇంతకంటే గొప్ప విషయం ఏమంటుందని సోషల్ మీడియాలో కామెంట్ లో వినిపిస్తున్నాయి.
Italian Prime Minister Giorgia Meloni has quit smoking — and shared the news with fellow G7 leaders over coffee.
European Council President Antonio Costa had his own milestone to offer: he gave up 21 years ago. pic.twitter.com/NcJmQ7qvP0
— euronews (@euronews) June 16, 2026
