బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతం కోసం పదేళ్ల రోడ్ మ్యాప్ ను విడుదల చేయనున్నారు. బహుముఖ వ్యూహాత్మక సంబంధాలను పెంచేందుకు ఈ సదస్సు ఓ ముఖ్యమైన అవకాశంగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పరస్పర అవగాన ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సహకారం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని పేర్కొంది. భేటీలో ముఖ్యంగా ప్రజా సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, వాతావరణ, వైద్య రంగాలపై చర్చించనున్నట్లు తెలిపింది.