
బంగ్లాదేశ్ లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళ్తున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మదారిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళ్తున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటీకీ వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.