
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన చేపట్టారు. రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాలకొ్లు వ్యవసాయ కార్యాలయం వద్ద ఉరితాడుతో నిలువ కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే, వారికి ఉరే గతి అని అన్నారు. గత పంటకు సంబంధించి రైతుల ధాన్యం సొమ్ము రూ. 4 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.