Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫాంహౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయనకు గాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి నుంచి పల్లా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ నేడు హాజరు కానున్నారు. బీఆర్కే భవన్ లో విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు పలువురు నేతలు ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.