Nagula Chavithi : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథస్వామి దేవస్థానంలో నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం ప్రత్యేక పూజలు జరుగుతున్న వేళ, దేవాలయ ప్రాంగణంలో ఓ అద్భుత ఘటన చోటుచేసుకుంది. శివలింగం పైన ఒక్కసారిగా రెండు నాగుపాములు పైకి చేరి పడగ విప్పి నిలబడ్డాయి.
ఈ దృశ్యం చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, భక్తి పరవశానికి లోనయ్యారు. సర్పాలు ఆ లింగంపై సుమారు పది నిమిషాల పాటు నిలిచి, తరువాత నెమ్మదిగా పక్కకు జారిపోయినట్లు సాక్షులు తెలిపారు. ఈ ఘటనను చూసినవారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భక్తులు ఈ సంఘటనను శివ శక్తి ప్రబావంగా భావిస్తూ, “శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడని” భావోద్వేగానికి లోనవుతున్నారు. దేవాలయ పూజారి మాట్లాడుతూ, “ఇది అరుదైన దృశ్యం. నాగుల చవితి రోజునే ఈ విధంగా రెండు నాగులు శివలింగాన్ని ప్రదక్షిణ చేస్తూ ప్రత్యక్షమవడం దైవ సంకేతమే” అని పేర్కొన్నారు.
స్థానికులు చెబుతూ, “ప్రతి సంవత్సరం ఈ పర్వదినం నాడు ఆలయంలో భారీగా పూజలు నిర్వహిస్తాం. కానీ ఈసారి ఇంత అద్భుత దృశ్యం చూడడం మా అదృష్టం” అని ఆనందం వ్యక్తం చేశారు.
దేవాలయం చుట్టుపక్కల గ్రామాల నుంచీ ప్రజలు ఈ వార్త తెలుసుకొని తరలివస్తూ శివలింగ దర్శనం చేస్తున్నారు. నాగుల చవితి రోజు ఇలా నాగదేవతలు ప్రత్యక్షమవ్వడం శుభ సూచకమని భావిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సంఘటనతో చెర్లోపల్లి విశ్వనాథస్వామి దేవాలయం భక్తజనాలతో కిటకిటలాడుతోంది.
దేవాలయ ప్రాంగణంలో “ఓం నమః శివాయ” నినాదాలతో గగనమంతా మార్మోగుతోంది.
నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం
శివలింగంపైన పడగవిప్పి నిల్చున్న నాగుపాములు
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి నిల్చున్న రెండు… pic.twitter.com/LmGDUk6OAL
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025