
టోక్యో ఒలింపిక్స్ లో రజతం సాధించి భారతదేశం జెండాను ఎగురవేసిన మీరాబాయి చాను జీవితచరిత్రపై సినిమా రానున్నది. చాను బయోపిక్ తీసేందుకు ఇంఫాల్ కు చెందిన స్యూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మణిపూర్ లోని నాంగ్ పాక్ కాచింగ్ గ్రామంలో ఉన్న మీరాబాయి చాను నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో మీరాబాయి, స్యూటీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బయోపిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రెసిండెంట్ మనబ్ ఎంఎం.. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకుంటూ. ఇంగ్లీష్ తో పాటు వివిధ భారతీయ భాషల్లో డబ్ చేయనున్నట్లు తెలిపారు.