
జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి హెల్త్ సర్వేకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా అని వాకబు చేశారు. ఆరోగ్యం ఎట్లా ఉందని చిన్నా, పెద్దలను పలకరించారు. సర్వేకు వచ్చే వారికి కుటుంబ ఆరోగ్య వివరాలు అందిస్తే ఏమైనా సమస్య ఉన్నట్లు తేలితే త్వరగా చికిత్స అందించడానికి వీలువుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.