
కరోనా నియంత్రణ కోసం వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్ ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.