
శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు రాహుల్ ద్రవిడ్ ఆందోళన చెందినట్లు కనిపించింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్ కు చేరుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ చాహర్ కు తమ్ముడు రాహుల్ చాహర్ తో ఏదో సందేశం పంపించాడు. అప్పటికే 3 వికెట్టు తీసిన లెగ్ స్పిన్నర్ హసరంగ ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో అతడి బౌలింగ్ లో షాట్లు ఆడొద్దని ద్రవిడ్ సూచించారు. 47వ ఓవర్లో దీపక్ కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్ చాహర్ అక్కడికి చేరుకొన్నాడు. ద్రవిడ్ సందేశాన్ని సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన రెండు ఓవర్లలో టీమ్ ఇండియా షాట్లు ఆడలేదు. మిగతా వాళ్ల బౌలింగ్ లో పరుగులు రాబట్టి విజయం సాధించింది.