
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి డిఫెన్స్ కాలనీలో వ్యాపారి కిడ్నాఫ్ కలకలం రేపింది. కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని ఆరిఫ్ అక్బర్ ను 10 మంది దుండగులు కారులో తీసుకెళ్లారు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి దుకాణంలో ఉన్న రూ. లక్షల విలువైన కలప ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆర్థక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని భావిస్తున్నారు.