
ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. 8 లక్షల నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు విజయవాడ నుంచి వెళ్లాయి. మిగతా జిల్లాలకు 50 వేల టీకా డోసులు పంపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులు ఏపీలో సుమారు 18 లక్షల మంది ఉన్నారు. వీరిలో శనివారం వరకు 28శాతం మంది తొలి టీకా వేయించుకున్నారు.