
పెగాసస్ స్పైవేర్ వివాదం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. పెగాసస్ స్పైవేర్ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరు కూడా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ మరింత తీవ్రమైన దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో మంగళవారం విపక్ష సభ్యులందరూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెగాసస్ కేంద్రంగానే ఈ సమావేశం కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పెగాసస్ ప్రాజెక్టు మీడియా నివేదిక వ్యవహారంపై జీరో అవర్ లో నోటీసు ఇవ్వనున్నారు.