
దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1,110 ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం డిప్లొమా ట్రెయినీ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాగా తాజాగా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి హైదరాబాద్ లో 76 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం.
రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. https://www.powergridindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఆగష్టు 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను చేపడతారు.
రేపటి నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 11,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్లు ఐటీఐ అప్రెంటీస్ కోసం, ఎలక్ట్రికల్ లేదా సివిల్ డిప్లొమా చేసిన వాళ్లు డిప్లొమా అప్రెంటీస్ కోసం, ఇంజనీరింగ్ పాసైన వాళ్లు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.