
ఏపీలోని విజయవాడలో బీజేపీ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై చర్చించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూన్ 21 యోగా దినోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జూన్ 28న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్ లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఏపీ ఇంచార్జి పి. మురళీధరన్, జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సహా ఇంచార్జి స్సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పివిఎస్ మాధన్, విష్ణువర్థన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు.