బ్లూటిక్ ఫైట్ లో మోదీ ప్రభుత్వం బిజీ.. రాహుల్
కేంద్రంలోని మెదీ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల గురించి పట్టించుకోకుండా ట్విట్టర్ బ్లూటిక్ కోసం ప్రభుత్వం పోరాడుతోందంటూ ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ఆదివారం ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం బ్లూటిక్ కోసం పోరాటం చేస్తోంది. ఒక వేళ మీకు వ్యాక్సిన్ కావాలంటే ఆ సంగతి మీరే చూసుకోండి అని రాహుల్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి, ఆరెస్సెస్ చీప్ వ్యక్తిగత ఖాతాలకు ట్విటర్ బ్లూటిక్ తొలగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం […]
Written By:
, Updated On : June 6, 2021 / 10:00 PM IST

కేంద్రంలోని మెదీ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల గురించి పట్టించుకోకుండా ట్విట్టర్ బ్లూటిక్ కోసం ప్రభుత్వం పోరాడుతోందంటూ ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ఆదివారం ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం బ్లూటిక్ కోసం పోరాటం చేస్తోంది. ఒక వేళ మీకు వ్యాక్సిన్ కావాలంటే ఆ సంగతి మీరే చూసుకోండి అని రాహుల్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి, ఆరెస్సెస్ చీప్ వ్యక్తిగత ఖాతాలకు ట్విటర్ బ్లూటిక్ తొలగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.