
ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 20,345 కొ్త్త కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 13,22,934 చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 108 కరోనా మరణాలు సంభవించాయి.