
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 10,69,544 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాక ముఖ్య కార్యదర్శి అనికుమార్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో లాక్ డౌన్ తప్పేలా లేదన్న భావన వ్యక్తమవుతున్నది.