https://oktelugu.com/

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ఈ వారంలో వరుసగా రెండు రోజుల లాభాలతో 50 వేల పైకి దూసుకెళ్లిన సెన్సెక్స్ ఈ రోజు నష్టాలతో మళ్లీ 50 వేల దిగువకు పడిపోయింది. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు స్వల్పకాలం పాటు లాభాల్లోకి వెళ్లి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. 50,088 వద్ద ట్రేండింగ్ మొదలు పెట్టిన సెన్సెక్స్ చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. ఇక 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 15,030వద్ద ముగిసింది. కోల్ […]

Written By: , Updated On : May 19, 2021 / 04:15 PM IST
Follow us on

ఈ వారంలో వరుసగా రెండు రోజుల లాభాలతో 50 వేల పైకి దూసుకెళ్లిన సెన్సెక్స్ ఈ రోజు నష్టాలతో మళ్లీ 50 వేల దిగువకు పడిపోయింది. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు స్వల్పకాలం పాటు లాభాల్లోకి వెళ్లి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. 50,088 వద్ద ట్రేండింగ్ మొదలు పెట్టిన సెన్సెక్స్ చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. ఇక 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 15,030వద్ద ముగిసింది. కోల్ ఇండియా, సిప్లా, సన్ ఫార్మా యూపీఎల్ లాభాలను ఆర్జించాయి.