
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా రేవంత్ ను అడ్డుకున్నారని, ప్రతిపక్ష పార్టీ హక్కులను తెరాస కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్ అక్రమ నిర్బంధాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.