Maa Elections: మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి.. మానిక్
తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. మా అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరారు. 110 మంది సభ్యుల […]
Written By:
, Updated On : August 14, 2021 / 02:50 PM IST

తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. మా అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరారు. 110 మంది సభ్యుల మద్దతు మంచు విష్ణుకు ఉందని మానిక్ తెలిపారు.