
ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బాషా బ్లాక్ ఫంగస్ తో మృతిచెందారు. 20 రోజుల క్రితం కొవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్న ఆయన.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఒంగోలకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. భాషా మృతి తో ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ మృతులసంఖ్య రెండుకు చేరింది.