Mother-in-law Daughter-in-law Conflict : వంద జుట్లు కలిసి ఉంటాయి. మూడు సిగలు కలిసి ఉండలేవు. వెనకటికి ఓ మహానుభావుడు చెప్పిన సూక్తి ఇది. జీవితా అనుభవం వల్ల.. అతడు ఈ సూక్తిని చెప్పాడు. అప్పట్లోనే అతనికి ఇంత జ్ఞానం కలిగిందంటే.. ఎంతటి జీవిత సారాన్ని అతడు అవపోసన పట్టాడో అర్థం చేసుకోవచ్చు. అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు ఆడవాళ్లు ఏమాత్రం మారలేదు. పైగా సీరియల్స్, ఇరుగుపొరుగు ముచ్చట్లు ద్వారా ఆడవాళ్లు మరింత భిన్నంగా తయారయ్యారు. ఇందులో కొంతమందిని మినహాయిస్తే మిగతా వారంతా కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూనే ఉన్నారు. ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఓర్చుకోలేక కారాలు మిరియాలు నూరుతుంటారు.
ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ సమయంలో అత్తకు కోడలికి గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పటి కాలంలో చాలావరకు ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోయాయి. ఒకవేళ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పటికీ.. అత్త కోడల మధ్య ఒకప్పటి స్థాయిలో అనుబంధం ఉండడం లేదు. పైగా కలిసి ఉన్నప్పటికీ అంతగా సాంగత్యం ఉండడం లేదు.. ఒకప్పుడు అంటే కోడళ్ళు ఇంట్లో పనులు చేసేవారు. బయటి పనులకు కూడా వెళ్లేవారు. ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు చేసే కోడళ్ల తరం రావడంతో అత్తల పెత్తనం చాలావరకు తగ్గిపోయింది. సినిమాల్లో చూపించినట్టుగా.. సీరియల్స్ లో కనిపించినట్టుగా అత్తలు ఇప్పుడు లేరు.
అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వార్త ప్రకారం.. అత్త కోడలి మధ్య ఏర్పడిన వివాదాలు పెను ప్రకంపనలు సృష్టించాయి. వారిద్దరి మధ్య వ్యవహారం ఏకంగా జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశమైంది. హరియన రాష్ట్రంలోని ఫరీదాబాద్ ప్రాంతంలో యోగేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడికి 9 సంవత్సరాల క్రితం నేహా అనే అమ్మాయితో పెళ్లయింది. నేహా, యోగేష్ ఉద్యోగస్తులు కావడంతో.. తమ ఆరు సంవత్సరాల కూతురు ను చూసుకోవడానికి యోగేష్ తన తల్లిని తన వద్దకు పిలిపించుకున్నాడు. అయితే దీనిపై నేహ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి అతడు యోగేష్ నచ్చ చెప్పాడు. అయినప్పటికీ నేహా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారాయి. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు నేహా నోరు జారింది. భర్తను నానా మాటలు అన్నది. భార్య ఆ స్థాయిలో తిట్టడంతో యోగేష్ తట్టుకోలేకపోయాడు. పైగా తన తల్లిని కూడా ఆమె తీవ్రస్థాయిలో దూషించడంతో భరించలేకపోయాడు.
భార్య అన్న మాటలు పదేపదే గుర్తుకు రావడంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు. నిర్వేదానికి గురయ్యాడు. తన తల్లి విషయంలో భార్య అనుసరిస్తున్న వ్యవహార శైలిని అతడు తీవ్రంగా తప్పుపట్టాడు. పైగా తనను భార్య ఇష్టానుసారంగా తిట్టడంతో తట్టుకోలేకపోయాడు. మరో మాటకు తావు లేకుండా తాను నివాసం ఉంటున్న భారీ భవనం నుంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో యోగేష్ సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి జాతీయ మీడియాలో భారీగా కథనాలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులకు యోగేష్ తల్లి ఫిర్యాదు చేయడంతో.. నేహా, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు
The only mistake of 38 year old radiotherapist Yogesh was that he wanted to keep his mother with him so that she can take care of his son as both he and his wife were doing jobs
His wife Neha Rawat fought over it, got her brothers to fight with Yogesh & left him & their son for… pic.twitter.com/4q3evI7NyR
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) October 26, 2025