
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడట కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించాడో పూర్తి వవరాలు తెలియాల్సి ఉంది.