
మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కులధ్రువీకరణను బాంబే హైకోర్టు రద్దు చేసింది. అమరావతి ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారంటూ శివసేన నేత ఒకరు బాంబే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ రద్దుతో పాటు రూ. 2లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు నిర్ణయంతో నవనీత్ కౌర్ ఎంపీ పదవి ప్రమాదంలో పడినట్లయింది.