
కోవిడ్ -19 కోసం ఉపయోగించే అన్ని రకాల పరికరాలు, ఔషధాలపై అన్ని రూపాల్లోని పన్నులు, కస్టమ్స్ సుంకాలను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టపరచాలని, పరికరాలు, మందులు, ఆక్సిజన్ సరఫరాలను పెంచాలని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, కంటెయినర్లు, కోవిడ్ సంబంధిత ఔషధాలను అనేక మంది విరాళంగా ఇస్తున్నారని మమత తన లేఖలో పేర్కొన్నారు.