Mahanadu 2025: కడప వేదికగా జరుగుతున్న మూడు రోజుల మహానాడు సభలకు నోరు ఊరించే వంటను తయారు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వడ్డిస్తున్నారు. మహానాడు నిర్వహించే ప్రాంతంతో సంబంధం లేకుండా భోజన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ సారి కడపలో జరుగుతున్న వేడుకలోనూ ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు వంటి ప్రసిద్ధ పిండివంటలను చేస్తున్నారు.