spot_img
Homeజాతీయ వార్తలుmagic figure elections India : ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దక్కేందుకు ఆయా రాష్ట్రాల్లో...

magic figure elections India : ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దక్కేందుకు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు గెలవాలంటే..

magic figure elections India : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మండే ఎండల్లో ఓటర్లు ఈసారి రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం కూడా ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా జరగడానికి చర్యలు తీసుకుంది.

సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత.. లెక్కింపు జరుగుతుంది. పోలింగ్, కౌంటింగ్ కు మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. పెద్ద రాష్ట్రాలలో ఎన్నికలు జరిగేటప్పుడు.. రెండు లేదా మూడు దశల్లో నిర్వహిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, వివి ప్యాట్ లను స్ట్రాంగ్ రూములలో భద్రపరుస్తారు. వాటికి లాక్ కూడా వేస్తారు. కౌంటింగ్ రోజు అభ్యర్థుల ముందు ఈవీఎం యంత్రాలను అన్ లాక్ చేస్తారు. ఆ తర్వాత వారి ముందు లెక్కింపు ప్రక్రియ చేపడతారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఎప్పటికప్పుడు లెక్కిస్తారు.

కౌంటింగ్ తర్వాత గెలిచిన సీట్లను అన్ని పార్టీలు బేరీజు వేసుకుంటాయి.. ఆ సీట్ల ఆధారంగానే తమకు అధికారం దక్కుతుందా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తాయి.. సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ సమయంలో మ్యాజిక్ ఫిగర్ అనే విషయం చర్చకు వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ అనేది ఒక కొరుకుడు పడని బ్రహ్మ పదార్థం.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ గురించి ఒకసారి పరిశీలిస్తే…

అస్సాం రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 64 సీట్లు సాధిస్తే అధికారాన్ని దక్కించుకోవచ్చు..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 294 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 148 స్థానాలలో విజయం సాధిస్తే అధికారం సొంతం చేసుకోవచ్చు.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 118 స్థానాలు గెలుచుకుంటే అధికారాన్ని దక్కించుకోవచ్చు.

కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 71 స్థానాలలో విజయం సాధిస్తే అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 16 స్థానాలలో విజయం సాధిస్తే అధికారం సొంతం చేసుకోవచ్చు.

1/3 వంతు మెజారిటీ సొంతం చేసుకుంటే.. దానిని మ్యాజిక్ ఫిగర్ అని పిలుస్తుంటారు. మ్యాజిక్ ఫిగర్ సాధించిన పార్టీ.. అధికార పార్టీగా అవతరిస్తుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ సాధించని క్రమంలో హంగ్ ఏర్పడుతుంది. అప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు ముఖ్యమంత్రి అవుతారు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version