
Madhya Pradesh News: మనం చేసిన తప్పులే మనల్ని వేధిస్తాయి. అవే మనకు శిక్షలు వేస్తాయి. జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనకు తెలియకుండానే మనం కొన్ని పొరపాట్లు చేసే వీలుంటుంది. కానీ అవే మన బతుకుకు అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ కు చెంిన మిహిక (పేరు మార్చారు) (22) కు 14 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఉద్యోగం కోసం ఆమె పలు ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని పొరపాటు చేసింది. అదే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారింది.
మిహిక ఉద్యోగం కోసం జబల్ పూర్ నుంచి ఇండోర్ కు వచ్చింది. ఆమెకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇండోర్ లోనే ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరు రెండేళ్ల సంసారం చేశారు. మిహిక ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఒక రోజు మిహిక ఇంట్లో లేని సమయంలో అమిత్ అక్కడకు చేరుకుని తాను మాజీ ప్రియుడినని పరిచయం చేసుకున్నాడు. తరువాత మిహిక భర్త వచ్చి భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.
దీంతో మిహిక జీవితం ఒంటరిదైపోయింది. తన జీవితంలోకి మళ్లీ అమిత్ ప్రవేశించాడు. నిన్ను పిల్లల్ని చూసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. ఒకరోజు అమిత్ ఓ నీచమైన పనికి ఉపక్రమించాడు. తన ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఇంటిలో విందు ఇచ్చాడు. మిహికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయించాడు. దీంతో ఆమె జరిగిన అన్యాయాన్ని సహించలేకపోయింది.
తరువాత కూడా మెహర్ అనే గ్రామంలో పని దొరికిందని భార్యను అక్కడికి తీసుకెళ్లాడు. ఈ సారి కూడా మత్తు మందు ఇచ్చి ముగ్గురు స్నేహితులతో మరోసారి ఆమెపై అత్యాచారం చేయించాడు. దీంతో ఆమె భరించలేక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వెతుకుతున్నారు. వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిహిక తన ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి గాధ: దీనికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకు?
వయసులో తేడా.. ఏజ్డ్ డాక్టర్ తో యువతి ప్రేమ.. ఇద్దరి మధ్య కొనసాగుతున్న రగడ