spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh and Trivikram: ప్చ్.. మహేష్ సినిమాలో కూడా అదే ఫైట్ !

Mahesh and Trivikram: ప్చ్.. మహేష్ సినిమాలో కూడా అదే ఫైట్ !

Mahesh and Trivikram
Mahesh and Trivikram

Mahesh and Trivikram: త్రివిక్రమ్ కి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు.. తనకున్న ఆ అలవాట్ల క్రమంలో వచ్చే ఆనవాయితీని పద్దతలను త్రివిక్రమ్ కచ్చితంగా అనుసరిస్తాడు. ఈ అనవసర పరిచయాలు లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లో పోతే.. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక సీన్ రాస్తాడు. ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఒక చిన్నపాటి ఫైట్ ను పెడతాడు.

కరెక్ట్ గా గమనిస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ ఇది కామన్. ఇప్పుడు త్రివిక్రమ్ ‘సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న చిత్రానికి సంబంధించి కూడా ఓ ట్రాఫిక్ అండ్ గ్రాఫిక్ ఫైట్ ను డిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫైట్ తాలూకు సెట్ వర్క్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. మహేష్ – త్రివిక్రమ్ సినిమా వచ్చే నెల నుంచి ఈ సెట్ లోనే షూట్ స్టార్ట్ కాబోతుంది.

కాగా ఈ సెట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణీ దర్శకత్వంలో రెడీ అవుతుంది. ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ను ఇస్తోంది. అన్నట్టు త్రివిక్రమ్ కి ఉన్న మరో ఆనవాయితీ.. తన ప్రతి సినిమాలో సీనియర్ హీరోయిన్‌ ని పెట్టడం. ఈ క్రమంలోనే నదియా, ఖుష్బూ, దేవయాని, టబు ఇలా తన ప్రతి సినిమాలో ఒక మాజీ బ్యూటీని పెట్టుకుని ఆమె చుట్టూ ఒక చిన్న కథ అల్లుకుంటాడు.

అలాగే మహేష్ సినిమాలో కూడా మొదట శిల్పా శెట్టిని అనుకున్నారు. అయితే, ఆమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని కారణాల కారణంగా ఇప్పుడు ఆమె స్థానంలో సీనియర్ హీరోయిన్ శోభన వచ్చింది. శోభన – మహేష్ కాంబినేషన్ అదిరిపోతోంది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే హారికా హాసిని క్రియేషన్స్ 2022లో సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

Also Read: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబినేషన్​ మూవీ షూటింగ్​ స్టార్ట్​ అప్పటినుంచే!

త్రివిక్రమ్ మొదటి సినిమా పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper
Exit mobile version