
మా మసకబారిపోయింది అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. నాగబాబు తనకి మంచి మిత్రుడని మా చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని నరేశ్ తెలిపారు. తన ప్యానల్ ని పరిచయం చేస్తూ తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్ గా శనివారం ఉదయం నరేశ్ మీడియా ముందుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా మా ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.