Payyavula Keshav: నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కార్యకర్తలతో పాటు నేతలంతా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది ఇప్పుడు అత్యవసరం అన్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇది సహేతుకమైన నిర్ణయమని అన్నారు. కడపలోని మహానాడు ప్రాంగణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.