Kamal Haasan: సిని హీరో, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే రాజ్యసభకు పంపించనున్నట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో లోక్ సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కమల్ పొత్తు పెట్టుకున్నారు. అందులో భాగంగా డీఎంకే ఆయన్ను రాజ్యసభ సీటుకు పంపించాల్సి ఉందని తెలుస్తుంది. తమిళ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్ ను ఒప్పందం ప్రకారం రాజ్యసభకు పంపిస్తామని తాజాగా డీఎంకే వెల్లడించింది.