
బీహార్ లో మరో 10 రోజులు లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే మే 15 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆ లాడ్ డౌన్ ను మరింత పొడిగించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మే 16 నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై క్యాబినెట్ లో సమీక్ష నిర్వహించమని లాక్ డౌన్ సత్పలితాలు ఇచ్చిందని ఈ సమావేశంలో తీర్మానించామని అందుకే లాక్ డౌన్ ను మరో 10 రోజులు పొడిగించాలని నిర్ణయించామని నితీశ్ కుమార్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.